Thursday, March 6, 2025

బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 34 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 34 మంది మృతి చెందగా 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మస్తుంజ్ జిల్లాలోని ఈద్ మిలాద్ నబీ ప్రాంతంలో మసీదులో మహ్మాద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు జరుపుకుంటుండగా బాంబు పేలుళ్లు జరిగాయి. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ బాంబు దాడికి ది పాకిస్థాన్ తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ దాడిలో డిఎస్ పి మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  మస్తుంజ్ జిల్లాలో సెప్టెంబర్ నెలలో బాంబు పేలుళ్లు జరగడం ఇది రెండో సారి.  ఇదే జిల్లాలో 2018లో జరిగిన బాంబు దాడిలో 128 మంది మృతి చెందగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

 

Also Read: కర్నాటకలో అమలవుతున్న పథకాలు చూపిస్తా… బిఆర్ఎస్ మంత్రులు రెడీనా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News