Monday, December 23, 2024

సోదరిని వేధించడంతో బావను చంపిన బామర్ది

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్: వివాహం జరిగిన అనంతరం నాలుగు సంవత్సరాల నుంచి సోదరిని వేధించడంతో బావను హ బామర్ది హత్య చేసిన సంఘటన శుక్రవారం సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్‌నగర్ హాఫిజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ నయీం(33)కు గత నాలుగు సంవత్సరాల క్రితం సా భాబేగంతో వివాహం జరిగింది. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. వీరి మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా వీరి ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది.

ఈ విషయాన్ని సాభాబేగం తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లి తన కుమారుడైన సులేమాన్ అహ్మద్, మేనమామ రోషన్‌లకు గొడవ విషయం సమాచారం అందించింది. వెంటనే వారు బావ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో నయీం మెడ భాగంలో దాడి చేశారు. దీంతో అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉప్మానియా హాస్పటల్‌కు తరలించారు. బాధితుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News