Friday, November 15, 2024

కివీస్ పై బంగ్లా చారిత్రాత్మక విజయం..

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 332 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ను బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లా దెబ్బ కొట్టాడు.10 వికెట్లతో చెలరేగడంతో శనివారం ఐదో రోజు 181పరుగులకే కివీస్ కుప్పకూలింది. దీంతో కివీస్ పై బంగ్లదేశ్ 150 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాంటో (105) శతకంతో జట్టును ఆదుకున్నాడు. ముష్ఫికుర్ రహీం (67), మెహదీ హసన్ మీరాజ్ 50 (నాటౌట్)లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. న్యూజీలాండ్ బౌలర్లలో ఏజాజ్ పటేల్ నాలుగు, ఐష్ సోధి రెండు వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ టామ్ లాథమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డేవోన్ కాన్వే (22) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. జట్టును ఆదుకుంటారని భావించిన కేన్ విలియమ్సన్ (11), హెన్రీ నికోల్స్ (2) కూడా నిరాశ పరిచారు. వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (6), గ్లెన్ ఫిలిప్స్ (12), కైల్ జేమిసన్ (9) కూడా విఫలమయ్యారు.  ఈ విజ‌యంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తైజుల్ ఇస్లాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 317 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News