Monday, December 23, 2024

క్రిప్టోకరెన్సీపై నిషేధం!

- Advertisement -
- Advertisement -

దేశీయ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉందని ఆర్‌బిఐ ఆందోళన
అంతర్జాతీయ సహకారం కోరుతున్న ప్రభుత్వం n లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి

Ban on cryptocurrency

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీపై ఆర్‌బిఐ (భారతీయ రిజ ర్వు బ్యాంక్) ఆందోళన వ్యక్తం చేస్తోందని, దీనిని నిషేధించాలని కోరుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సోమవారం లోక్‌సభ లో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దే శీయ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోకరెన్సీతో ము ప్పు ఉందని ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని నిషేధించడానికి చట్టం రూపొందించాలని ఆర్‌బిఐ సిఫారసు చేసిందని సీతారామన్ అన్నా రు. ఈ ఆధునిక కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ లేదా ప్రభుత్వం ద్వారా జారీ చేయలేదు, అందువల్ల ఈ క్రిప్టోకరెన్సీలను కరెన్సీగా గుర్తించకూడదని ఆర్‌బిఐ పేర్కొంటోంది. ఈ క్రిప్టోకరెన్సీలు సరిహద్దులు లేనివి, వీటిని నియంత్రణ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారం అవసరమని మంత్రి తెలిపారు.

గడువు పెంచమంటున్న రాష్ట్రాలు

జిఎస్‌టి పరిహారం గడువును మరో ఐదేళ్లు పొడిగించాలని తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు కోరుతున్నాయని సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పలు రా ష్ట్రాలు జిఎస్‌టి వల్ల ఆదాయంలో కొరతను చూస్తున్నాయి. జిఎస్‌టిని అమలు చేస్తున్న సందర్భంలో ఆదాయం నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ప రిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జిఎస్‌టిని అమలు చేశారు. దీని వల్ల నష్టం వచ్చిన రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు ప రిహారం చెల్లిస్తూ వస్తోంది. అయితే ఈ పరిహారం చెల్లింపు గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. జిఎస్‌టి పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని 42వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో సిఫారసు చేసినట్టు ఆర్థికమంత్రి తెలిపారు.

5% జిఎస్‌టి షురూ

ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, ధాన్యాలు, ప ప్పులు, పిండి వంటి ఆహార పదార్థాలు, ముందు గా ప్యాక్ చేసిపై వస్తువులపై 5 శాతం జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. 25 కిలోల లొపు ఉన్న ముందస్తుగా ప్యాక్ చేసిన ఆహార వస్తువులపై జిఎస్‌టి ఉం టుంది. అలాగే పెరుగు, లస్సీ వంటి వాటికి 25 లీటర్ల లోపు పరిమాణం నిర్ణయించారు. ఈ నెల 18కి ముందు జిఎస్‌టి అమలు చేసిన వీటికి యూనిట్ కంటెయినర్ నిర్ణయించారు. కొత్త జిఎస్‌టి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉదాహారణకు పప్పు ధాన్యాలు, గోదుమ, పండి వంటి వాటికి గతంలో బ్రాండ్, ప్యాక్‌లకు 5 శాతం జిఎస్‌టి ఉంది. ఇప్పుడు ప్యాక్ చేయడానికి ముందే జిఎస్‌టి విధిస్తారు.

అంతర్జాతీయ కారణాలతో రూపాయి పతనం

సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధామిస్తూ, డాలర్‌తో రూపాయి మారకంలో చరిత్రాత్మక పతనం జరిగిందని అంగీకరించారు. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు పెరుగుదల, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కఠినతరం వంటి కారణాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిందని మంత్రి అన్నారు. బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరోలు డాలర్‌తో పోలిస్తే ఎక్కువగా క్షీ ణింటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గానే ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News