Thursday, January 23, 2025

ఈ కుక్కల్ని పెంచుకోకండి!

- Advertisement -
- Advertisement -

ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం చాలామందికి ఇష్టం. డబ్బున్నవాళ్లు విదేశాలనుంచి ఖరీదైన బ్రీడ్స్ ను తెప్పించుకుని పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కొన్ని రకాల కుక్కలు రక్షణ మాట మరచి, మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 23 రకాల చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించింది. ఆ జాబితాలో ఉన్న కుక్కలేమిటో ఒకసారి మీరూ చూడండి.

పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ స్టాఫోర్డ్ షైర్ టెర్రియర్, డోగో అర్జెంటినో, అమెరికన్ బుల్ డాగ్, తోసా ఇను, ఫిలా బ్రసిలీరో, బోయెస్ బోయెల్, కనగల్, సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్ సౌత్ రష్యన్ డాగ్, టోరంజిక్, సర్ ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, రాట్ వీలర్, టెరియర్స్, రొడేషియన్ రిడ్జ్ బ్యాక్, ఓల్ఫ్ డాగ్, కానరియో, బండాగ్, మాస్కో గార్డ్, ఆక్బాష్, కేన్ కోర్సో. ఈ కుక్కలను పెంచుకోవద్దని కేంద్రం హితవు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News