Monday, September 9, 2024

చేపల వేటపై నిషేధం 15 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో చేపల వేటపై నిషేధాన్ని 15 రోజుల పాటు అంటే ఈ నెల 15 వరకు పొడిగించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య ‘అన్యాయం, నిర్లక్షంతో కూడుకున్నది’ అని కాంగ్రెస్ విమర్శించింది. ఇది మత్సకారులకు ఆర్థిక నష్టాలు కలుగజేస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. చేప పిల్లల పెరుగుదలకు మరింత వ్యవధి ఇవ్వాలన్న మత్సకారుల సంఘం వినతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ ఫిషరీస్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడానికి ముందు శాస్త్రీయ డేటాను, వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నదని ఆయన తెలిపారు. పశ్చిమ తీరంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్పును అనుసరించవచ్చునని ఆయన సూచించారు. 2021 నుంచి గుజరాత్‌లో చేపల వేటపై వార్షిక నిషేధం జూన్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News