- Advertisement -
న్యూఢిల్లీ : ఇదివరకు గడువు విధించినట్టుగానే మార్చి 31 వరకు ఉల్లిపై నిషేధం కొనసాగుతుందని, ధరలను అదుపులో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. గృహావసరాలకు అందుబాటులో ఉంచడమే లక్షంగా పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 8 న ప్రభుత్వం మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం ఎత్తివేయలేదని, ఇది అమలవుతోందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. నిషేధం ఎత్తివేసినట్టు వార్తలు రావడంతో దేశం లోనే భారీ హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ లాసల్‌గోన్‌లో ఫిబ్రవరి 17 నుంచి 19 నాటికి 40.62 శాతం వంతున ధరలు పెరిగి క్వింటాల్ రూ.1800కు చేరింది.
- Advertisement -