Monday, December 23, 2024

నటుడు నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతికి కోర్టులో చుక్కెదురైంది. నరేష్ నటించిన ‘మళ్ళీ పెళ్లి'( తెలుగు), ‘మట్టే మదువే'(కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ వేసిన ఇంజక్షన్ దావా బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టు ఆగస్టు 1న కొట్టివేసింది. అయితే, ఇప్పటివకే ‘మళ్ళీ పెళ్లి’ మూవీ థీయేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది. దీంతో ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా నిర్మాతలు ఈ సినిమాని ప్రసారం చేయవచ్చు.

ఇదిలావుంటే, తన మాజీ భార్య రమ్య రఘుపతిని హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఉన్న తన నివాసంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రముఖ నటుడు నరేష్ వేసిన ఇంజక్షన్ దావాపై కోర్టు మంగళవారం విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసుతోపాటు నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసింది. దీనికి కౌంటర్ గా నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిపై గృహ నిషేదం కేసు పెట్టారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రాకుండా అతని మాజీ భార్య రమ్య రఘుపతిపై కోర్టు నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News