Sunday, November 17, 2024

పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిగరెట్లు, బీడీ లు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రాహిత మాచన రఘునందన్ అభిప్రాయపడ్డారు. సిగరెట్ల తో పాటు బీడీలు,ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని, హెల్త్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్న దరిమిలా.. ఆదివారం నాడు “మాచన” మాట్లాడుతూ.. హెల్త్ టాక్స్ విధింపు,పెంపు అనే నిర్ణయాల తో పాటు పొగాకు,పొగాకు ఉత్పత్తులను పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాతం లో అరకిలోమీటరు వరకు విక్రయించకూడదు ఆన్న ఆంక్షల్ని విధించి అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అభ్యర్ధిoచారు.

ప్రధాని నరేంద్రమోడీ బాలలతో,విద్యార్థులతో కలివిడిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న విషయం దృష్టి లో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీ లు ఉన్న చోట అర కిలోమీటర్ దూరం వరకు పొగాకు,పొగాకు ఉత్పత్తుల విక్రయం పై నిషేధం విధిస్తే భవిష్యత్ భారతం ఎంతో వికసిస్తుంది. చారిత్రాత్మమైన నిర్ణయం అవుతుంది.హెల్త్ టాక్స్ పెంపు ఆహ్వానించదగ్గ పరిణామమే, హర్షణీయమే,సిగరేట్ పాకెట్ల ను కాకుండా..విడిగా విక్రయిస్తే,టాక్స్ మరింత పెంచితే..యువత ధూమపానం కు దూరంగా ఉండే అవకాశం ఉందని మాచన రఘునందన్ యువత భవిత ను దృష్టి లో పెట్టుకుని సూచన చేశారు.ఇరవై ఏళ్లు గా పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నందుకు,పొగాకు ఉత్పత్తుల పై కేంద్రం తీసుకునే నిర్ణయం ఆరోగ్య భారతానికి దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News