Monday, December 23, 2024

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దండనే

- Advertisement -
- Advertisement -

Ban on single-use plastic items come into force

అమలులోకి వచ్చిన కేంద్ర ఉత్తర్వులు

న్యూఢిల్లీ : కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై శుక్రవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయించేందుకు తగు విధంగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. ముందుగానే ఈ ప్లాస్టిక్ నిషేధం అమలు గురించి ప్రచారం సాగించాయి. సంబంధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వలు చేయడం లేదా వాటిని అమ్మడం వంటి కార్యకలాపాలలో ఉన్న కంపెనీలు, ఏజెన్సీల మూసివేతకు నోటీసులు వెలువరించారు. తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని, ఈ ప్లాస్టిక్ వస్తువుల తయారీ అమ్మకాలతోనే బతుకుతున్నామని, కొందరికి ఉపాధి కల్పిస్తున్నామని పలువురు ఉత్పత్తిదార్లు తెలిపారు.

నిషేధం విధింపును తాము పట్టించుకోబోమని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తి సంస్థలకు నిషేధం గురించి కావల్సినంత సమయం ఇచ్చామని , అదే విధంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం కుదరదని సాధారణ పౌరులకు కూడా తెలియచేశామని పలు విధాలుగా ప్రచారం చేశామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవలే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషేధం విధిగా అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనిని ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులు లేదా సంస్థలకు తగు కటుతర శిక్షలు ఉంటాయి. జరిమానాలు లేదా జైలు ఒక్కోసారి ఈ రెండూ అమలుపరుస్తారు. పర్యావరణ పరిరక్షణ చట్టం (ఇపిఎ) సెక్షన్ 15 పరిధిలో ఈ చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News