Wednesday, January 22, 2025

విల్ స్మిత్‌పై నిషేధం…

- Advertisement -
- Advertisement -

Will Smith Slaps Chris Rock Over Joke About Wife At Oscars

హాలీవుడ్ స్టార్, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్‌పై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చర్యలు తీసుకుంది. పదేళ్ల పాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా అతనిపై నిషేధం విధించింది. అకాడమీ నిర్వహించే ఇతర వేడుకల్లోను పాల్గొనరాదని చెప్పింది. ‘కింగ్ రిచర్డ్’ సినిమాకు విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అతడికిచ్చిన అవార్డును మాత్రం అకాడమీ వెనక్కి తీసుకోలేదు. 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్‌స్మిత్ వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతనిపై అకాడమీ చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News