Monday, December 23, 2024

ఉత్తరాఖండ్‌లో 15న తలపెట్టిన మహాపంచాయత్‌ను నిషేధించాలి

- Advertisement -
- Advertisement -
వలస వెళ్ళిన వారిని తిరిగి రప్పించాలి : అసదుద్దీన్ ఓవైసి

హైదరాబాద్ : రైట్‌వింగ్ గ్రూపులు ఈ నెల 15న ఉత్తరాఖండ్‌లో తలపెట్టిన మహాపంచాయత్‌ను నిషేధించాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అక్కడ నివసించే ప్రజలకు భద్రత కల్పించాలని, అక్కడి నుంచి వలస వెళ్లిన వారినివెనక్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తరాఖండ్‌లోని బిజెపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవలత ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దోషులను జైలుకు పంపి శాంతిని నెలకొల్పడమే అక్కడి బిజెపి పభుత్వ పని అని ఓవైసి అన్నారు.

ఉత్తరకాశీలోని పురోలా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 15న మహాపంచాయత్‌ను నిర్వహించాలని రైట్‌వింగ్ గ్రూపులు ప్లాన్ నిర్ణయించాయని, జూన్ 15లోగా దుకాణాలు మూసివేసి రాష్ట్రం విడిచి వెళ్లాలని ముస్లిం వ్యాపారులను బెదిరిస్తూ పురోలా మార్కెట్‌లో పోస్టర్లు వెలిశాయని పేర్కొన్నారు. ఉద్రిక్తత, బెదిరింపుల కారణంగా, ముస్లింలు తమ దుకాణాలను మూసివేశారు కొన్ని కుటుంబాలు జిల్లా నుండి వలస వెళ్ళాయి.

నివేదికల ప్రకారం, మే 26న ఇద్దరు పురుషులు, ఒక ముస్లిం, ఒక హిందువు, 14 ఏళ్ల బాలికను అపహరించడానికి ప్రయత్నించడంతో సమస్య మొదలైంది. ఇది ‘లవ్ జిహాద్’ కేసు అని కొందరు ఆరోపించారు. నిందితులను అరెస్టు చేసినప్పటికీ కొన్ని మితవాద సంఘాలు నిరసనలు నిర్వహించి అనేక మంది ముస్లింల దుకాణాలు, ఇళ్లపై దాడి చేశాయి. మే 29న పురోలాలో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది, కొంతమంది ఆందోళనకారులు ముస్లింలకు చెందిన దుకాణాలు, సంస్థలపై దాడి చేశారు. దరిమిలా అక్కడ శాంతియుత పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత, అక్కడి ప్రజలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వంపై ఉందని ఓవైసి ట్విటర్ ద్వారా వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News