Friday, November 15, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌కు సవాల్,
నేడు ఢిల్లీలో రెండో టి20

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జేట్లి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తొలి టి20లో గెలిచిన భారత్ ఈసారి కూడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. బంగ్లా కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌లో ని లవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నె లకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉండడంతో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మొదటి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాకు ఈ పోరు సవాల్‌గా తయారైంది. సిరీస్ ను సమం చేయాలంటే మ్యాచ్‌లో విజయం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇలాంటి స్థితి లో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని ముందుకు సాగితేనే బంగ్లాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఆత్మవిశ్వాసంతో..
భారత్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా సమతూకం గా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తా రుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు జట్టుకు కీలకం గా మారారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు మెరుగైన ఆరంభాన్ని అందించాలని జట్టు కోరుకుంటోంది. సం జు ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అం శంగా చెప్పాలి. అయితే అతను చివరి వరకు క్రీజు లో నిలవాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా భారీ స్కోరును చేయక తప్ప దు.

ఇద్దరు రాణిస్తే జట్టు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక కెప్టెన్ సూర్యకుమార్‌పై కూడా జట్టు భారీ అంచనాలతో ఉంది. తొలి టి 20లో సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచాడు. 14 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని భావిస్తున్నాడు. చివరి వరకు క్రీజు లో నిలిచి జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఉ న్నాడు. హార్దిక్ పాండ్య ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. తొలి టి 20లో హార్దిక్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. పొ దుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాట్‌తో నూ సత్తా చాటాడు. 16 బంతుల్లోనే అజేయంగా 39 పరుగులు చేశాడు. ఈసారి కూడా అతనిపై జ ట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

అంతేగాక నితీష్ రె డ్డి, రియాన్ పరాగ్, రింకు సింగ్ వంటి హార్డ్ హిట్టర్‌లు కూడా జట్టులో ఉన్నారు. రింకు సింగ్, పరాగ్‌లు విధ్వంసక బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఛాన్స్ లభిస్తే దూకుడుగా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా భార త్ చాలా బలంగా కనిపిస్తోంది. గ్వాలియర్‌లో భా రత బౌలర్లు అద్భుతంగా రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ 14 పరుగుల మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీశాడు. హార్దిక్, వరున్ చక్రవర్తి, మయాంక్ యాదవ్‌లు మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. ఈ సారి కూడా వీరిపై జట్టు భారీ నమ్మకాన్ని పెట్టుకుంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న భార త్ ఈ మ్యాచ్‌లో గెలుపుపై కన్నేసింది.

చావోరేవో..

మరోవైపు బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి మ్యాచ్‌లో బ్యా టింగ్ వైఫల్యం బంగ్లాను వెంటాడింది. ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు పర్వేజ్, లిటన్ దాస్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు తొలి మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ సారి మెరుగ్గా ఆడాలని జట్టు భావిస్తోంది. కెప్టెన్ శాంటో కూడా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. మహ్మదుల్లా, మెహది హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, జాకేర్ అలీ తదితరులతో బంగ్లా బ్యాటింగ్ బలంగానే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News