Tuesday, April 8, 2025

బనకచర్లపై దాపరికమెందుకు?

- Advertisement -
- Advertisement -

అక్రమ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ డిమాండ్ బనకచర్లపై
కేంద్రం నుంచి గోదావరిబోర్డుకు ఐదు నెలల క్రితమే లేఖ అయినా
తెలంగాణకు సమాచారం ఇవ్వని అధికారులు నిలదీసిన రాష్ట్ర
అధికారులు ప్రాజెక్టు డిపిఆరే సిద్ధం కాలేదని ఎపి అధికారుల
వివరణ వరద జలాలను మాత్రమే తీసుకుంటామని
స్పష్టీకరణ వాడివేడిగా సాగిన గోదావరి బోర్డు సమావేశం
పెదవాగు ఆధునీకరణ పనులపై చర్చ రూ.15 కోట్ల వ్యయంతో
తక్షణం రిపేర్లు చేయాలని నిర్ణయం బోర్డు కార్యదర్శి పనితీరుపై
తెలంగాణ అధికారుల ఫిర్యాదు మహిళా ఉద్యోగులను
వేధిస్తున్నారని ఆరోపణ

బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకు జిఆర్‌ఎంబి అడ్డుకట్టవేయాలి. బనకచర్ల ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఇది తెలంగాణ నీటి లభ్యతపై తీవ్రప్రభావం చూపుతుంది. వ్యవసాయ రంగం, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి.

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపి స ర్కారు అక్రమంగా నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్రఅభ్యంతరం వ్య క్తం చేసింది. సోమవారం జలసౌధలో గో దావరి నదీ యాజమాన్య బోర్డు(జిఆర్‌ఎం బి) చైర్మన్ ఎకె ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఏపి, తెలంగాణ నీటిపారుదల అధికారుల వాదోపవాదనలపై వేడెక్కింది. ఏపి ప్రభుత్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తెలంగాణ అధికారులు ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష పోకడలకు జిఆర్‌ఎంబి అడ్డుకట్టవేయాలని తెలంగాణ నీటిపారుదల అధికారులు పట్టుబట్టారు.

ముందునుంచి ఏపి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల విషయంలో అత్యంత గో ప్యత పాటిస్తుందని తెలంగాణ అధికారు లు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టను అక్రమ ప్రాజెక్టుగా ప్రకటించాలని, బనకచర్ల ప్రాజెక్టు అంశంపై గోదావరి బోర్డుకు కేంద్రం నుంచి అధికారికంగా లేఖ అందినప్పటికీ ఏపి ప్రభుత్వం గత ఐదు నెలలుగా బేఖాతర్ చేస్తుందని తెలిపారు. అక్రమంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతాల నీటి లభ్యతపై తీవ్రప్రభావం చూపుతుందని, వ్యవసాయరంగంగణాంకాలతో అధికారులు వివరించారు. తెలంగాణ అధికారుల అభ్యంతరాలపై ఏపి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిపిఆర్) ఖరారుకాలేదని తెలిపారు. అదేవిధంగా బోర్డు సమావేశంలో పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమావేశంలో చర్చించారు. రూ.15 కోట్ల వ్యయంతోరిపేర్లు చేయాలని నిర్ణయించారు.

కార్యదర్శి తీరు బాగోలేదు

గోదావరి బోర్డు కార్యదర్శి అజగేషన్ విధినిర్వహణలో వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గోదావరి బోర్డులో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న తెలంగాణ, ఏపి అధికారులను వేధిస్తున్నారని, మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ము ఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సి అనిల్ కుమార్, ఏపి జలవనరుల శాఖ ఈఎన్‌సి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News