Monday, December 23, 2024

మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంఎల్‌సి బండ ప్రకాష్ శనివారం నా మినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రు లు కెటిఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంఎల్‌సిలు మధుసూదనచారి,

వి. గంగాధర్ గౌ డ్,తాత మధు,ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్, బిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బండ ప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పదవికి కేవలం ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అధికారికంగా మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా పేరును ఆదివారం ప్రకటించనున్నారు. తదనంతరం మండలి డిప్యూటీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
మండలి విప్‌ల నియామకం
రాష్ట్ర శానసమండలి చీప్ విప్‌గా భానుప్రసాద్, విప్‌లుగా శంభీపూర్ రాజు, పాడి కౌశిక్‌రెడ్డిలు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News