Tuesday, November 5, 2024

ఎస్‌సి కార్పొరేషన్ నూతన ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Banda Srinivas Appointed As SC Corporation Chairman

ఉద్యమకారులను సిఎం కెసిఆర్ సముచితంగా గౌరవిస్తారు
మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇందుకు బండా శ్రీనివాస్ నియమాకమే తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కెసిఆర్ జ్ఞాపకశక్తి చాలా గొప్పదని, ఉద్యమంలో,పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారందరిని గుర్తు పెట్టుకున్నారని, సమయం వచ్చినప్పుడు సముచిత స్థానం కల్పిస్తారన్నారు. బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ,ప్రజలందరి భద్రత,సంక్షేమం,అభ్యున్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, దళిత బంధు వంటి పథకం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదన్నారు. శ్రీనివాసుకు మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, అక్బర్ హుస్సేన్, కృష్ణమోహన్ రావు,పొనుగంటి మల్లయ్య,గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండి కరుణాకర్,జిఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News