Tuesday, December 17, 2024

సందడిగా అలయ్‌ బలయ్‌.. హాజరైన పలువురు ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని జలవిహార్‌లో సందడిగా జరుగుతున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీనటుడు కోట శ్రీనివాసరావు, మంచు విష్ణు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులను హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను తమిళిసై అభినందించారు.

Bandaru Dattatreya Alai Balai program at Jalavihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News