Thursday, January 16, 2025

ప్రజల మనిషిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి జిట్టా: గవర్నర్ బండారు దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

జిట్టాకు నివాళులు అర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణా రెడ్డి పోరాటం చేశారని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనిషిగా ఎదిగారని, మన మధ్యలో జిట్టా లేని లోటు ఎవరు తీర్చాలేనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ నెల 06న అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి సంతాప సభ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ లో జిట్టా కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జిట్టా బాలకృష్ణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు మీడియాతో మాట్లాడారు.

జిట్టా బాలకృష్ణరెడ్డి మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తిని భువనగిరి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోయారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ బాధితులతో విశేషంగా పోరాడిన వ్యక్తి జిట్టా బాలకృష్ణరెడ్డి అని గుర్తు చేశారు. ఎలాంటి పదవులు లేకపోయిన కానీ జిట్టా నేడు ప్రజల మనసులలో నిలిచిపోయారన్నారు. ఆయన ఎంతో మంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తన సొంత ఆస్తులను అమ్ముకొని తన స్వంత డబ్బులతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి జిట్టా బాలకృష్ణరెడ్డి అని ప్రశంసించారు. జిట్టా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆశయాల కొరకు మన అందరం కలిసి పని చేద్దామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News