- Advertisement -
ఛండీగఢ్ : హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంజాబ్ -హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా ఆయన చేత ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దత్తాత్రేయను ఇటీవల కేంద్రం హర్యానాకు బదిలీ చేసింది. ఇక్కడ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపుర గవర్నర్‌గా బదిలీపై వెళ్లారు. దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ విపి సింగ్ బద్నోర్, హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు.
Bandaru Dattatreya sworn in as Governor of Haryana
- Advertisement -