Wednesday, January 22, 2025

కావేరీ జలాల వివాదంపై బెంగళూరు బంద్

- Advertisement -
- Advertisement -

1000 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు: కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయరాదంటూ కర్నాటకలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాన్న కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలపై కన్నడ రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం బెంగళూరు బంద్‌కు సిలుపునిచ్చిన వివిధ రైతు, ప్రజా సంఘాల కూటమి‘కర్నాటక జల సంరక్షణ సమితి’ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరులోని విధానసౌధనుంచి రాజ్‌భవన్‌కు నిరసనకారులు ప్రదర్శన చేపట్టగా నిఫేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంగా దాదాపు 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరమంతటా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు 1000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ బి దయానంద చెప్పారు.

అమలులో ఉన్న నిబంధనలు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నగరంలో ఎలాంటి బంద్ లేదా, ప్రదర్శన జరిపేందుకు అనుమతి లేదని ఆయన చెప్పారు. ఈ బంద్‌కు బిజెపి, జెడి(ఎస్) మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బంద్ దృష్టా నగరంలోఅత్యవసర సర్వీసులు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు.సిటీ బస్సులతో పాటుగా అన్ని రవాణా వాహనాలు నిలిచిపోయాయి.పాఠశాలు, కళాశాలకు సెలవు ప్రకటిస్తూ అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కె ఎ దయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ ఐటి సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటివద్దనుంచే పని చేయాలని సూచించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News