Wednesday, January 22, 2025

బంధన్ బ్యాంక్ మధ్యంతర ఎండి, సిఇఒగా రతన్ కుమార్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ప్రైవేట్ రంగ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) రతన్ కుమార్ కేశ్ బ్యాంక్ మధ్యంతర ఎండి, సిఇఒగా నియుక్తుడయ్యారు. ఆయన నియామకం ఈ నెల 10 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ ప్రస్తుత ఎండి, సిఇఒ, వ్యవస్థాపకుడు ఈ నెల 9న రిటైర్ కానున్నారు. కేశ్ మూడు నెలల పాటు లేదా కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించేంత వరకు, ఏది ముందైతే అప్పటి వరకు మధ్యంతర ఎండి, సిఇఒగా ఉంటారని బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్స్‌చేంజ్ వద్ద రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. కేశ్ నియామకం ఆర్‌బిఐ ఆమోదం, బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు, నామినేషన్, పారితోషికం కమిటీ శనివారం సమావేశంలో చేసిన సిఫార్సు ప్రాతిపదికగా జరిగింది. సెబీ లేదా అటువంటి ప్రాధికార సంస్థ ఉత్తర్వు ఆధారంగా డైరెక్టర్ పదవి నిర్వహించకుండా కేశ్‌ను నిషేధించడం గాని, అనర్హుడిని చేయడం గాని జరగలేదని ఫైలింగ్ తెలిపింది. కేశ్ నియామకం బ్యాంక్ వాటాదారుల ఆమోదముద్రకు కూడా లోబడి ఉంటుంది. కేశ్ నిరుడు మార్చి నుంచి బంధన్ బ్యాంక్ ఇడి, సిఒఒగా వ్యవహరిస్తున్నారు. ఆయన అంతకు ముందు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఏక్సిస్ బ్యాంక్‌లలో పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News