Tuesday, November 5, 2024

బంధన్ బ్యాంక్ 3 కోట్ల ఖాతాదారుల మైలురాయి

- Advertisement -
- Advertisement -

ముంబై : బంధన్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ 3 కోట్లకు పైగా కస్టమర్లతో కీలక మైలురాయి చేరుకుంది. ఏడున్నరేళ్ల కార్యకలాపాల్లోనే బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 2.17 లక్షల కోట్లను అధిగమించింది. బ్యాంక్ ఈ త్రైమాసంలో బలమైన వృద్ధిని సాధించింది. భారత దేశవ్యాప్తంగా 6000 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల ద్వారా 3 కోట్లకు పైగా కస్టమర్లుకు సేవలు అందిస్తోంది.

బంధన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 70,000గా ఉంది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఇప్పుడు రూ.1.08 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఖాతా, పొదుపు ఖాతా (సిఎఎస్‌ఎ) నిష్పత్తి ఇప్పుడు మొత్తం డిపాజిట్ పుస్తకంలో 39.3 శాతంగా ఉంది. అడ్వాన్సులు గతేడాదితో పోలిస్తే 10% వృద్ధిని సాధించగా, మొత్తం అడ్వాన్సులు ఇప్పుడు రూ.1.09 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫలితాలపై బ్యాంకు ఎండి, సిఇఒ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ, బ్యాంక్ నాలుగో త్రైమాసంలో వార్షిక ప్రాతిపదికన మంచి వృద్ధిని నమోదు చేసిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News