Wednesday, January 22, 2025

మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన బండి, భగవంత్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: రామగుండంలోని ఎన్టిపిసి మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా పరిశీలించారు. అనంతరం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సీఎల్) ను బండి సంజయ్, భగవంత్ ఖుబా సందర్శించనున్నారు. సందర్శన అనంతరం గోదావరిఖనిలోని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ నివాసానికి వెళ్లనున్నారు. బండి సంజయ్, భగవంత్ ఖుబా మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఎస్.కుమార్ నివాసంలో ప్రధాని రామగుండం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడనున్నారు. సభ ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, తదితరలు పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News