Thursday, January 23, 2025

ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ ’సినిమా బండి’

- Advertisement -
- Advertisement -

తన తొలి సినిమా ’సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెం డో చిత్రం ’పరదా’తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నా రు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శ న రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ సినిమాలో వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సె ప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. బుధవారం దుల్కర్ సల్మాన్ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజ ర్ కథానాయిక సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తుంది. కథకుడి ప్రకారం, సుబ్బు చాలా దూరం ప్రయాణించి తన జీవితా న్ని ముగించడానికి 70 లక్షలు చెల్లిస్తుంది.

ఆ తర్వాత సు బ్బు, దర్శన రాజేంద్రన్, సంగీత పోషించిన మరో ఇద్దరు ప్రధాన పాత్రలతో కలిసి సాహసోపేతమైన యాత్రకు బయలుదేరడం ఆసక్తిగా వుంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా, మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా”అని అన్నారు.

నిర్మాత విజయ్ మాట్లాడుతూ “ప్రవీణ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాను మలయాళం స్టార్ దుల్కర్ తీసుకున్నారు. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం”అని పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ “అనుపమ, దర్శన కంటెంట్‌పై చాలా నమ్మకం పెట్టారు. ఈ సినిమా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలకి బిగ్ ఓపెనింగ్స్ ఇస్తుంది. ఈ సినిమాకి కమర్షియల్‌గా డబ్బులు వస్తాయి. ఈ సినిమాతో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లు చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నిర్మాతలు శరత్ మరార్, శ్రీధర్, హీరోయిన్ దర్శన, సంగీత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News