Wednesday, January 22, 2025

ఆమెతో తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌సి కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బండి మీడియాతో మాట్లాడారు. ఇడి నోటీసులతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ కేసు నిందితులు తనకు తెలుసునని గతంలో కవితే చెప్పారన్నారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇంత వరకు సిఎం కెసిఆర్, కెటిఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ అడిగారు.

ఎంఎల్‌సి కవిత ఇడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రేపటి విచారణకు హాజరు కాలేనని కవిత తెలిపారు. ఈ నెల 15 తరువాత విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఈ నెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం తరువాత కవిత ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కవిత పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News