Saturday, November 23, 2024

భూసేకరణ చేయించలేని అసమర్థుడు బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కరీంనగర్ ఎంపి బండి సంజయ్ గత 4 సంవత్సరాల ఓటు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకున్న పాపనా పోలేదని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు విమర్శించారు. నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలోప్రారంభించిన పనులు మాత్రమే ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నాయని తెలిపారు.

ఎన్ హెచ్ 563 జగిత్యాల నుండి వరంగల్ హైవే లైన్ ను 2016 లోనే సాంక్షన్ అయి, టెండర్లు పూర్తై, భూసేకరణ జరిగి పనులు కొనసాగుతున్నాయన్నారు. వినోద్ కుమార్ ఎంపీగా పని చేసిన కాలంలో ప్రారంభం చేసిన ఎన్ హెచ్ 563 రహదారి పనులను ఇప్పటి ఎంపి బండి సంజయ్ ప్రధాన మంత్రి మోడి చేతుల మీదుగా ప్రారంభించే ప్రయత్నం చేయడం చాలా సిగ్గు చేటన్నారు.

గత పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ ప్రారంభం చేసిన పనులను బండి సంజయ్ తిరిగి మల్లి ప్రారంభం చేసే ప్రయత్నాన్ని చేయడం ప్రజలు గమనించాలన్నారు. ఎప్పుడో ప్రారంభమై కొనసాగుతున్న హైవై లైన్ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రారంభం చేసి అబాసుపాలు కావద్దని కోరారు.

గత 4 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు శామీపేట ప్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని దానికి రక్షణ శాఖ రంగం భూములు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేటాయించకపో వడం మీ అసమర్థత కాదా, అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ ప్రజల మీద ప్రేమ ఉంటే శామీపేట ప్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కు భూములు కేటాయించేలా వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

గతంలోనే అప్పటి ఎంపీ వినోద్ కుమార్ అసన్ పర్తి నుండి కరీంనగర్ కు సాంక్షన్ చేయించిన రైల్వే లైన్ కు ఇప్పటి వరకు సర్వేచేయించి భూసేకరణ చేయించలేని అసమర్థులు బండి సంజయ్ అని అరోపించారు. సంబంధిత రైల్వే లైన్ కు ఇప్పటి వరకు సర్వే ప్రారంభం కాలేదని…కొత్తగా రైల్వే మంత్రి వచ్చి సర్వే ప్రారంభం చేస్తామని చెప్పడం చాలా విడ్డూరం అన్నారు. బండి సంజయ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోగానే ప్రజలు, అభివృద్ధి గుర్తుకొస్తుందని విమర్శించారు.

నిరుద్యోగులకు మీ బీజేపి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిం చిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కల్లబొల్లి మాటలతో అబద్దాలతో, అసత్యాలతో రాజకీయ పబ్బం గడుపుకున్నారని నిప్పులు చెరిగారు.వంద కోట్ల అవినీతి చేశారనీ మీ బీజేపి పార్టీ నాయకులే గుసగుసలు పెడుతున్నారని, అందుకే మీ రాష్ట్ర అధ్యక్షపదవి ఊడిందని ప్రజలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు.

ప్రధాని వరంగల్ పర్యటనలో కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ, శామీర్ పేట ప్లైఓవర్ బ్రిడ్జ్ కి రక్షణ రంగం భూముల ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు నేతికుంట యాదయ్య, కంసాల శ్రీనివాస్, గంట కళ్యాణీ శ్రీనివాస్, గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్, గందె మాధవి మహేష్, వాల రమణ రావు, కోటగిరి భూమాగౌడ్, ఎదుల్ల రాజశేఖర్, జంగిలి సాగర్, నక్క పద్మ కృష్ణ, కాబట్టి లావణ్య శ్రీనివాస్, లెక్కల స్వప్న వేణు, బీఆర్‌ఎస్ నాయకులు కరీం, అనిల్, హామీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News