- న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకనే… తప్పించుకుని తిరుగుతున్న బండి
- రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్
కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్‌కు ఎంపీగా కొనసాగే అర్హతలేదని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు.
సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల మీద బండి సంజయ్‌కి గౌరవం లేదు, ఎన్నిసార్లు హాజరు కావాలని చెప్పిన తప్పించుకుని తిరుగుతున్నాడని అన్నారు. కోర్ట్ కేసు ఉన్నదని తెలిసి విదేశాలకు వెళ్లీ పుట్‌బాల్ ఆడుతున్నాడంటే కోర్ట్‌పైన ఎంపి బండి సంజయ్‌కి ఎంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. అందుకే కోర్ట్ జరిమానా వేసింది..న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేని సంజయ్ వెంటనే ఎంపి పదవీ రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ కార్పోరేటర్ నుండి బండి సంజయ్‌ది బ్లాక్ మెయిల్ బతుకేనని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతను డబ్బుల కలెక్షన్ చేసినందుకే బండిని రాష్ట్ర అధ్యక్ష ప దవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలిచిన తరువాత కోర్ట్ కేసు వేసి గ్రానైట్ వాళ్లపై ఫిర్యాదులు చేసి వారి దగ్గర పెద్దమొత్తంలో వసూళ్లు చేసి రాజీ పడిన చరిత్ర బండి సంజయ్‌ద న్నారు. మళ్ళీ ఓట్లు కోసం సంజయ్ వస్త్తే యువకులు, మహిళలు, రైతులు, ప్రజలంతా బండిని తగిన గుణపాఠవ చెబుతారని జ్యోష్యం చెప్పారు.
ఇండియా భారత్ మార్పుపై స్పందిస్తూ…మేకిన్ ఇండియా. డిజిటల్ ఇండియా అన్నప్పుడు మోడీకి భారత్ అనే పేరు ఎందుకు గుర్తుకు రాలేదు…కేసీఆర్ ముందు చూపుతోనే భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ భారత్ అని పేరు అంటున్నాడని పేర్కొన్నారు. ప్రధాని మోడి ఎప్పుడు ఒక పేరును కాపీ కొట్టడమే అన్నారు.
సభ్యత్వం లేని వారు కాంగ్రెస్ టికెట్‌కు దరఖాస్తులు..
కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళుకూడ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆశవాహులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు,దరఖాస్తులు అమ్ముకునే దుస్థితికి కాంగ్రెస్ చేరిందన్నా రు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌లో కలెక్షన్ సెలెక్షన్ ఎలెక్షన్ అనే పద్ధతి కొనసాగుతుందన్నారు.
ఈ విలేఖరుల సమావేశం లో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేష్, కెమసారం తిరుపతి, మేకల చంద్రశేఖ ర్, కర్రె శ్రీనివాస్, యాదవ్, రాము, మజీద్, యాసిన్, తివారీ, జయంత్, తదితరులు పాల్గొన్నారు.