Tuesday, January 7, 2025

ఆసక్తిగా ‘బందీ’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో హీరోగా ఎంట్రి ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం.. చాలా కాలం గ్యాప్ తర్వాత ఓ ఢిఫరెంట్ సినిమాతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆదిత్య, తిరుమల రఘు దర్శకత్వంలో బంధీ అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సింగిల్ క్యారెక్టర్ తోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చివరల్లో ఆదిథ్య ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా కూర్చున్న సీన్ తో మేకర్స్ ఆసక్తి పెంచారు.

గల్లీ సినిమా బ్యానర్‌పై ఈ మూవీని వెంకటేశ్వరరావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించగా.. మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News