Sunday, January 19, 2025

ఆర్‌కె బ్రదర్స్ పాలన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాన్ని రేవంత్, కల్వకుంట్ల
కుటుంబం కలిసి పాలిస్తున్నారు
లగచర్ల ఘటనపై ఢిల్లీలో
సెటిల్‌మెంట్..కెటిఆర్ అరెస్టు
కథ కంచికి ఫోన్‌ట్యాపింగ్,
కాళేశ్వరం, ఫార్ములా ఈ
ధరణి కుంభకోణాలన్నీ గాలికే
కెసిఆర్, రేవంత్ కుటుంబాల
మధ్య వ్యాపార సంబంధాలను
నిరూపిస్తా : కేంద్రమంత్రి
బండి సంజయ్

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : రాష్ట్రంలో ఆర్‌కె బ్రదర్స్ (రేవంత్, కల్వకుంట్ల) పాలన న డుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సం గారెడ్డిలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయు ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలోని లగచ ర్ల ఘటనలో కెటిఆర్ నిందితుడని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని, ఢిల్లీలో కాం గ్రెస్ పెద్దలను కలిసి మూటలు అప్పజెప్పిన త ర్వాత అరెస్ట్ దుకాణం బంద్ అయిందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ కులుంబాలకు మంచి వ్యాపార సంబంధాలున్నాయని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని, ఇదే నిజమైతే కెసిఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తనకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీని బ్యాన్ చేయాలని, విధ్వంసాలు చేయడానికి ఆ పార్టీ రాష్ట్రంలో కుట్రలు చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఫోన్ ట్యాపింగ్, మాజీ సిఎం కెసిఆర్ ప్రోద్బంలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా.. కెసిఆర్, కెటిఆర్‌లను అరెస్ట్ చేయకుండా ఉండేందుకునే కెటిఆర్ కాంగ్రెస్ పెద్దలను కలిశారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలను కలిస్తే అరెస్ట్‌లు, కేసులు క్లోజ్ చేస్తున్నారన్నారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడిచేసింది రైతులు కాదని, మాజీ మంత్రి కెటిఆర్ అనుచరులని ఆరోపించారు. అయినా కెటిఆర్‌ను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రైతులను ఒప్పించి ఫార్మాసిటీ నిర్మించాలని, అన్యాయంగా రైతుల అరెస్ట్ సరికాదన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో రైతులు దళారులకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. తరుగు, తేమ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News