Monday, December 23, 2024

కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన 3 కే రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇపుడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడీషియల్ విచారణ కోరడం సిగ్గు చేటన్నారు. బిఆర్‌ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజలకు మేలు జరిగే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

అయోధ్య రామయ్య అందరికీ దేవుడు
అయోధ్య రామయ్య అందరికీ దేవుడని అన్నారు. ప్రతీ భారతీయుడు రాముడి విగ్రహ పున:ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణం బిజెపికి సంబంధించిన కార్యక్రమం కానేకాదని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా? వ్యతిరేకమా? అన్నది స్పష్టం చేయాలన్నారు. పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదు అన్నారు. అయోధ్య నుండి శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికీ వెళుతున్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News