Sunday, December 22, 2024

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల దృష్టా జాతీయ కార్యవర్గాన్ని బిజెపి అధిష్ఠానం ప్రకటించింది. కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ను నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా మరోసారి డికె అరుణ (తెలంగాణ)ను కొనసాగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శిగా సత్యకుమార్ (ఆంధ్రప్రదేశ్)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తాజా మార్పులతో బిజెపి జాతీయ కార్యవర్గంలో మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు. తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు ఉన్నారు.

బండి సంజయ్, డికె ఆరుణలకు శుభాకాంక్షల వెల్లువ..
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్, ఉపాధ్యక్షురాలు డికె అరుణకు, సత్యకుమార్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా బిజెపి జాతీయ నేతలు విజయశాంతి, ఎంపి అర్వింద్‌తో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News