Thursday, January 23, 2025

బండి సంజయ్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay Arrest in Jangaon

జనగామ: కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పుగల్లు శివారులో బసచేసిన చోటే బండి సంజయ్‌ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ను ముందస్తు అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు దీక్ష స్థలికి చేరుకున్నారు. బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల తీవ్ర ప్రతిఘటనల మధ్య బండి సంజయ్ ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించిన పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Bandi Sanjay Arrest in Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News