Thursday, January 23, 2025

Paper leak: బండి సంజయ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

వరంగల్: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేశారు. హనుమకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్ మంజూరు చేశారు. సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ.20 వేలపూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌పై పిటిషన్‌పై దాదాపు ఎనిమిది గంటల పాటు వాదనలు సాగాయి. బండి సంజయ్ కస్టడీ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సంజయ్ విడుదల దృష్టా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలుకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 144 సెక్షన్, దుకాణాలు మూసివేయనున్నారు. దేశం దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని బండికి కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News