Monday, December 23, 2024

బండి సంజయ్ బర్త్ డే…. శుభాకాంక్షలు తెలిపిన నడ్డా, అమిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా బండి సంజయ్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పార్టీ జాతీయ నేతలతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బండి సంజయ్ కు ఫోన్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి చెందిన కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పేదలకు దుప్పట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News