Monday, December 23, 2024

తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది

- Advertisement -
- Advertisement -
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడి

హైదరాబాద్: తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 50 వేల కి.మీల మేరకు రోడ్ల పనుల నిర్మాణం జరుగుతోందన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దూది శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హుస్నాబాద్ నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి విచ్చేశారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేశారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందనే నమ్మకం నాకుంది. నితిన్ గడ్కరీ ఎట్లనో బండి సంజయ్ కూడా అట్లనే ఉన్నడు.. పని మొదలు పెడితే పూర్తి చేసి తీరుతారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాను. అందులో భాగంగా ఎల్కతుర్తి -సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు సముద్రాలకు వచ్చాను. ఈ రహదారి పనులు పూర్తయితే సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు మేలు ఉపయోగపడుతోంది.

కాంగ్రెస్ పాలనలో రోడ్లు వేస్తే ఏడాది దాటితే దెబ్బతింటాయి. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి జాతీయ రహదారుల పనులు చేపట్టారు. 5 ఏళ్ల పాటు రోడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టర్ భరించేలా నిబంధన విధించారు. మోదీ పాలనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నారు. తాను ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఇంఛార్జీగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం మేం పోరాడినం. రాజ్యసభలో నేను కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాను. అందరం పోరాడినందునే తెలంగాణ వచ్చిందన్నారు. ఇక్కడికి రోడ్ల పనులు ఎట్లా జరుగుతున్నాయనే అంశాన్ని ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాను. ముగ్గురు జిల్లా అధ్యక్షులు, స్థానిక నేతలు ఇక్కడికి వచ్చారు. మస్కట్ నుండి వచ్చిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం రూ.14 వేలు ఖర్చు పెట్టారని చెప్పారు. మరి మీరెంత ఖర్చు చేశారు. మీ అందరికీ మోదీ ఫ్రీగా వ్యాక్సిన్ డోసులను అందించారు. మూడేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రమే. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తెలంగాణకు వచ్చినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News