Wednesday, January 22, 2025

కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్ !

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి బండి సంజయ్ బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు సవాల్ విసిరారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ కరీంనగర్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా…అదే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే కెసిఆర్ సన్యాసం తీసుకుంటారా? ’’ అని ఛాలెంజ్ చేశారు. కెటిఆర్ పదేళ్లపాటు సిరిసిల్లా ఎంఎల్ఏగా ఉన్నప్పటికీ అక్కడ సమస్యలు పరిష్కరించలేదన్నారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని, నేతన్నలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తానని మోసంచేశారని అన్నారు.

అధికారం పోయాక బిఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దూషణలకు దిగాయని, కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని, బిఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ కూడా పలు రకాలుగా దోపిడికి యత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బండి సంజయ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News