Monday, December 23, 2024

నిరుద్యోగుల తరపున పోరాడితే అరెస్ట్ చేస్తారా?: బండి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్‌పై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. తప్పు చేసిన వారిని వదిలి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. టిఎస్‌పిఎస్‌సిలో పేపర్ లీకేజీని నీరుగార్చేందుకు సిట్‌కు అప్పగించారని దుయ్యబట్టారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News