- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ గా అసమ్మతి సమావేశాలు నిర్వహించుకుంటున్నారని బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటూ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యాపక, ఉపాధ్యాయ ఆత్యీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఉపఎన్నికలు తథ్యం అని స్పష్టం చేశారు. దీంతో పాటు వచ్చే ఉపఎన్నికల్లో బిజెపి 7 సీట్లు గెలవడం ఖాయమని కరాఖండిగా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ దొందూ దొందేనని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
- Advertisement -