Tuesday, April 8, 2025

మహిళల హామీలు ఏమయ్యాయి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు చేశారు. మహిళా సాధికారతను చేతల్లో చూపుతున్న మహనీయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 హామీ ఏమైంది? అని, తులం బంగారం, బెల్టు షాపుల నిర్మూలన హామీలు ఎటు పోయాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ మహిళలు రాణిరుద్రమదేవి వారసులని కొనియాడారు. మభ్య పెట్టే పాలకులకు కాల్చి వాత పెట్టడం తథ్యమని బండి సంజయ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News