Tuesday, December 17, 2024

బాసర ట్రిపుల్ ఐటి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

బాసర ట్రిపుల్ ఐటి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థి స్వాతి ప్రియ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. స్వాతిప్రియ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్రమంత్రి కోరారు. ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడాన్ని శనివారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధినికి న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే పోలీసులు, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాప్యం చేయకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విద్యార్ధుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు. ట్రిపుల్ ఐటీ విద్యార్ధి స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News