Sunday, December 22, 2024

బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేనికి బొమ్మ.. బొరుసు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. హుజూరాబాద్ లో ఆదివారం బిజెపి ఇంటింటి ప్రచారం చేస్తోంది. ఎంపి అభ్యర్థి బండి సంజయ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఐదేళ్లుగా మేము చేసిన అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్తున్నాం అని బండి సంజయ్ అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేనికి బొమ్మ.. బొరుసు లాంటివని ఆరోపించారు. బిజెపి అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నారు. కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయితేనే అభివృద్ధి జరుగుతోందన్నారు. రిజర్వేషన్లు పేరుతో పేదల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అనేది బ్రిటిష్ పార్టీ, బిజెపి.. స్వదేశీ పార్టీ అని ఆయన వెల్లడించారు. బిజెపి రాజ్యాంగాన్ని కాపాడింది బండి సంజయ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News