Saturday, December 21, 2024

కేంద్రంలో బిఆర్‌ఎస్ అధికారం ఈ శతాబ్దపు జోక్ : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసిన బిఆర్‌ఎస్ 2024లో కేంద్రంలో అధికారం వస్తుందని చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను పట్టించుకొని వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. 2023 లోనే రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి.. అధికారంలోకి వచ్చాక మీ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటు పడతామని ఆయన వెల్లడించారు.

Also Read: బోన్ క్యాన్సర్‌తో పోరాటం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేద దళిత కుటుంబాలను గాలికొదిలేసి సొంత పార్టీ కార్యకర్తలకు “దళిత బంధు” నిధులను పంచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజలను విశ్వసించను.. ప్రజలను కలవను.. ప్రజల పోరాటాలను సహించననే నినాదంతో పాలన చేస్తూ బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News