Monday, January 20, 2025

ఉత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు”అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఢిల్లీలో లిక్కర్ దందా చెసిన వారు తెలంగాణలో చేయలేరా? అంటూ ఎద్దేవ చేశారు. ఎన్నికల సమయంలో పివి నరసింహారావు జయంతి జరిపిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు జరుపలేదన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలన్నారు.

కర్నాటక ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం ఏమిటి? ఎపిలో కాంగ్రెస్ గెలుస్తదా? కాంగ్రెస్ తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. నాతో ఈటల, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేది మీడియా కల్పనే.. ఒక వర్గం మీడియా బిజెపి గ్రాఫ్‌ను తగ్గించి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఇమేజ్ ను పెంచాలని చూస్తున్నది. కోట్లు ముట్టినయని ఆధారాల్లేకుండా ఆరోపించడం సరికాదు… నిజంగా నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆధారాలు బయటపెట్టడండి. అధికారంలో ఉన్నది బిఆర్‌ఎస్సే కదా… దమ్ముంటే చెప్పాలి. నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెబుతున్నా… నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా బ్యాంకు ఖాతాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్నికల్లో టిక్కెట్ల కోసం బిజెపిలో తీవ్రమైన పోటీ నెలకొంది. శనివారం ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. ఈ మార్చ్‌కు భారీ ఎత్తున తరలిరావాలని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News