Thursday, January 16, 2025

తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో మీ వాటా ఎంత? : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ రహదారుల విస్తరణ పనులకు ఎనిమిదేళ్లుగా నిధులెందుకు సాధించలేక పోయారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలనుకోవడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ఆర్వోబీ నిర్మాణంలో తొలుత చేసుకున్న ఒప్పందం ప్రకారం 80 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం వాటా కేంద్రం చెల్లించేందుకు అంగీకరించింది. నిధులు విడుదల చేయాలంటూ నేను చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన. లేఖలు రాసినా స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం… నయాపైసా కూడా విడుదల చేయలేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ నిర్మాణ వ్యయం మొత్తం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే భరించేలా ఒప్పించానని వెల్లడించారు. వరంగల్ -కరీంనగర్, ఎల్కతుర్తి-సిద్దిపేట, కరీంనగర్ -జగిత్యాల రహదారి విస్తరణ పనులకు 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారో బిఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News