Tuesday, November 5, 2024

బిఆర్‌ఎస్ గంగలో కలిసింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ గంగలో కలిసిన పార్టీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని ఆయన తెలిపారు. తమకు బిఆర్‌ఎస్ పార్టీ అవసరం లేదని అ న్నారు. కెసిఆర్ ప్రస్థానం కాంగ్రెస్‌తో మొదలైందని, బీఆర్‌ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని అన్నారు. అందుకే కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ భవనాన్ని, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి బండి సంజయ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్, కెటిఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే విలీన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని,

రైతులకు బ్యాంకుల నుంచి ఎన్‌ఓసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బిజెపి కొట్లాడుతుందని బండి సంజయ్ తెలిపారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టి బొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ నిలదీశారు. రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ విలీన డ్రామాలను తెరమీదకు తీసుకువస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్‌లో రూ. 26 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాలకు ప్రజలకు అర్థమయ్యాయని తెలిసే ఈ విలీన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News