కరీంనగర్: కెసిఆర్ సర్కారులోని మంచి పథకాలు కొనసాగిస్తామని బిజెజి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి మండలం బడ్డిపల్లి గ్రామంలో మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా టిఫిన్ బైటక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. ధరణి మంచి పథకమే కానీ కెసిఆర్ కుటుంబానికి అసరాగా మారిందన్నారు. ధరిణిలో మార్పులు చేసి కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బిఆర్‌ఎస్‌లో చేరుతారన్నారు.
Also Read: విష్ణు ప్రియతో ప్రేమపెళ్లిపై స్పందించిన జెడి చక్రవర్తి
కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది కెసిఆర్ అని అన్నారు. అభివృద్ధి నిధులపై సిఎం కెసిఆర్ చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బండి మండిపడ్డారు. మహమూద్ అలీ ఉగ్రవాదులు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్పందించలేదని చురకలంటించారు. కిడ్నాప్‌లు, మహిళలపై దాడులు జరుగుతుంటే మహమూద్ అలీ ఎక్కడికి పోయారని బండి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తే సిఎం కెసిఆర్‌కు వణుకు పుడుతుందని మండిపడ్డారు. బిజెపి నుంచి ఎవరూ ఇతర పార్టీలోకి వెళ్లరని అన్నారు.