- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింపచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయి. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. బిసి కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే మజ్లిస్‌ను సంతృప్తి పరచాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బిజెపి అండగా ఉంటుందన్నారు.
- Advertisement -