Friday, November 15, 2024

గ్రూప్-1 నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో సారి బిఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. దీన్ దయాల్  జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… గ్రూప్-1 నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది. టిఎస్ పిఎస్సీ నిర్వాకంతో 30 లక్షల మంది బతుకులు బజార్ల పడ్డాయి. యువత భవిష్యత్ నాశనమవుతుంటే కెసిఆర్ నోరెత్తటం లేదు అని ప్రశ్నించారు.

లక్షలు ఖర్చు చేసి సిద్ధిమైన వారికీ ఉద్యోగాలపై ఆశ లేకుండా పోయిందన్నారు. టెన్త్, ఇంటర్, గ్రూప్-1 అన్ని పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాలే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడంతో అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్క మిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై సోమవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News