Saturday, December 21, 2024

మా సిఎం కెసిఆర్ కనిపించడంలేదు.. కెటిఆర్ పైనే మాకు అనుమానం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై బిజెపి ఎంపి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మా ముఖ్యమంత్రి కెసిఆర్ కనిపించడం లేదని, మాకు మంత్రి కెటిఆర్ పైనే అనుమానం ఉందని అన్నారు. సిఎం కెసిఆర్ 15 రోజులుగా కనిపించకపోవడంపై తమకు ఏదో అనుమానం కలుగుతోందని బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు.

సిఎం కెసిఆర్ ను కెటిఆర్ ఏమైనా చేసిండా?, లేక ఏమైనా ఇబ్బంది పెడుతుండా? అని అనుమానం కలుగుతుందని, ఎందుకంటే ఆయన మా సిఎం అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. మా సిఎం కెసిఆర్ తో మీడియా సమావేశం పెట్టించాలని, అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతామని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News