Wednesday, December 25, 2024

క్వింటాకు పది కిలోల తరుగు తీస్తున్నారు: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో తరుగు తీస్తున్నారని బిజెపి నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్వింటాకు ఆరు నుంచి పది కిలోల వరకు తరుగు తీస్తున్నారని, తరుగు లేకుండా ధాన్యం కొంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ… హామీగానే మిగిలిపోయిందని బండి సంజయ్ చురకలంటించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి… కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా ఏం లేదని, రైతులకు రూ.500 బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారని, డబ్బులు లేకుండా ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News